కల్కి ట్రైలర్ రిలీజ్

25 June, 2019 - 6:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం కల్కి. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రయూనిట్ మంగళవారం విడుదల చేసింది. ఆకాశవాణి.. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు దారుణ హత్య అంటూ ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతోంది. చంపింది ఎవరో చెప్పాల్సింది నేను అంటూ రాజశేఖర్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ముగుస్తుంది.

అయితే ఈ ట్రైలర్‌ అద్యంతం ఆకట్టుకునేలా ఉంది. హ్యాపీ మూవీస్ పతాకంపై.. శివానీ శివాత్మిక మూవీస్ సమర్పిస్తున్న ఈ కల్కి చిత్రం జూన్ 28వ తేదీ అంటే శుక్రవారం విడుదల కానుంది. ఈ రోజు విడుదలైన ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.