క్లాసులో ప్రభాస్

11 May, 2019 - 7:19 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ చిత్రం వివిధ భాషల్లో నిర్మిస్తున్నారు. ఆ క్రమంలో ఈ చిత్రం హిందీలో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాను హిందీ నేర్చుకుంటున్నట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు.

అందుకోసం సోని అనే టీచర్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా క్లాసులు ఏర్పాటు చేసుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నట్లు తెలిపారు. తాను హిందీ రాస్తాను, మాట్లాడతానని పేర్కొన్నారు. కానీ ఇంట్లో హిందీ మాట్లాడుకోం కదా అని అన్నారు.

నెల రోజులకు పైగా క్లాసులకు వెళ్లినట్లు ప్రభాస్ చెప్పారు. తొలి షెడ్యూల్‌లో చాలా కష్టంగా అనిపించిందని.. ఆ తర్వాత మామూలు అయిపోయిందన్నారు. కాగా హిందీ వెర్షన్‌లో మాత్రం తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ప్రభాస్ స్పష్టం చేశారు.