ముఖ్య అతిథిగా ‘ప్రభాస్’

05 November, 2018 - 3:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘RRR’ పేరును వర్కింగ్ టైటిల్‌గా ఖరారు చేశారు.

అలాగే ఈ చిత్ర షూటింగ్ నవంబర్ 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అతిథిగా రాబోతున్నట్లు టాలీవుడ్‌‌లో టాక్ వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి కథ విజయేంద్ర ప్రసాద్‌ అందించారు. కాగా ఇందులో తారక్‌, రామ్‌చరణ్‌కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.