వరుసగా రెండో రోజూ పెట్రో మంట!

15 May, 2018 - 11:02 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఒకవైపున వెలువడుతుండగా.. వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 15 పైసలు పెరగగా, డీజిల్‌ ధర లీటరుకు 22 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర తాజాగా 56 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. డీజిల్ ధరలది కూడా ఇదే ధోరణి. తాజాగా మరో ఆల్‌‌టైం హైని టచ్‌ చేసింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌‌సైట్‌ అందించిన వివరాల ప్రకారం ఢిల్లీలో పెట్రోలు లీటర్‌కు రూ.74.95, కోల్‌కతాలో 77.65 రూపాయలు, ముంబైలో 82.79 రూపాయలు, చెన్నైలో 77.77 రూపాయలుగా ఉంది. డీజిల్ ధరలు వరుసగా రూ. 66.36 లీటరు, రూ. 68.9, రూ.70.66, రూ. 70.02గా ఉన్నాయి. మే 15న ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.