శ్రీకాళహస్తిలో పవన్ కల్యాణ్

15 May, 2018 - 4:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): తిరుమలలో రెండు రోజులు బస చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడి నుంచి మంగళవారం శ్రీకాళహస్తి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్లి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.పవన్ కల్యాణ్ రాకతో ఆలయం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘పవన్ కల్యాణ్ సీఎం’ అంటూ ఆలయం ప్రాంగణంలో నినాదాలు చేశారు. శ్రీకాళహస్తిలో స్వామివారి దర్శనం తరువాత పవన్ కల్యాణ్ గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామిని, వికృతమాలలోని శ్రీసంతాన వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.