పవన్ దెబ్బకు పచ్చ మీడియా అబ్బా…

12 May, 2018 - 5:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు న్యూస్ చానళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 2018 ఏప్రిల్ 20న పవన్ ఈ పిలుపు ఇచ్చారు. నిజానికి ఫలాన టీవీ చానెల్స్‌‌ని బహిష్కరించమని ఏ నేత అయినా పిలుపునిస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఊహించడం కష్టం. ఈ సమాచార యుగంలో ఆయా న్యూస్ చానల్స్ చూడకూడదని ఏ రాజకీయ నాయకుడైనా పిలుపునివ్వడం నిజానికి సాహసమే.

వైఎస్ జగన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వార్ ప్రకటించి, ఆ విలేఖరులను తన మీడియా సమావేశాలకు రావద్దని నిషేధించారు. అలాగే టీడీపీ నేతలు కూడా సాక్షిని బహిష్కరించారు. ఈ బహిష్కరణల ప్రభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. జగన్ యుద్ధం ప్రధానంగా ఏబీఎన్‌‌తోనే.

అయితే పవన్ కల్యాణ్ ఫాలోయింగే వేరు. ఆయన టీవీ9, టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లను బహిష్కరించి మే 11కి ఇరవై రోజులు దాటింది. కాబట్టి ఆ పిలుపు ప్రభావం ఏమిటో స్పష్టమైపోవాలి.
మన దేశంలో టీవీ చానళ్లకు శాస్త్రీయంగా రేటింగ్ ఇచ్చే సంస్థ Broadcast Audience Research Council (BARC). దాన్ని సింపుల్‌గా బార్క్ అని పిలుస్తారు. అది వారానికొకసారి రేటింగ్స్ ఇస్తుంది. పవన్ పిలుపునిచ్చిన తర్వాత రెండు రేటింగ్స్ వచ్చాయి. 16, 17, 18 వారాల రేటింగ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ రేటింగ్స్‌ని బట్టి పవన్ బాయ్‌కాట్ పిలుపు ప్రభావాన్ని అంచనా కట్టవచ్చు. అదేమిటో చూద్దాం.

16వ వారం New Consumer Classification System (NCCS) Male 22+ రేటింగ్స్‌‌లో TV9 Telugu 1.45, TV 5 News 0.71, ABN Andhra Jyothi 0.55 గా ఉంది. అలాగే NCCS Male 15+ తరగతిలో TV9 Telugu 1.33, TV 5 News 0.67. ABN 0.54 రేటింగ్స్ పొందాయి.

ఇక BARC 18వ వారం రేటింగ్స్ కూడా పరిశీస్తే విషయమేమిటో అర్థమౌతుంది.
NCCS Male 22+ తరగతికి సంబంధించి TV9 Telugu 1.20, TV 5 News 0.70, Andhra Jyothi కి 0.59 రేటింగ్స్ లభించాయి.

NCCS Male 15 + కేటగిరీలో 16వ వారం అర్బన్ రేటింగ్స్‌కు సంబంధించి టీవీ 9కు 1.97 రేటింగ్ వస్తే 18వ వారంలో 1.30 రేటింగ్ లభించింది. ఇదే కేటగిరిలో టీవీ 5కి 16వ వారం 0.73 రేటింగ్ వస్తే 18వ వారం 0.70 వచ్చింది. చివరిగా ఏబీఎన్ చానల్‌‌కి 16వ వారం 0.78 ఉంటే అది ఇప్పుడు 0.59కి దిగజారింది.

రూరల్‌‌లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 22 ప్లస్ తరగతిలో 16వ వారం టీవీ9కి 1.10 రేటింగ్ ఉంటే 18వ వారంలో 1.04కి తగ్గింది. NCCS Male 15+ కేటగిరీలో TV9 Telugu 1.13, TV 5 News 0.68, ABN Andhra Jyothi 0.55 రేటింగ్స్ పొందాయి.ఈ గణాంక సమాచారాన్ని విశ్లేషిస్తే పవన్ బహిష్కరణ పిలుపు ప్రభావం ఎంతగా ఉందో తేటతెల్లం అవుతుంది. మరీ ముఖ్యంగా టీవీ 9 రేటింగ్స్ పవన్ దెబ్బకు నేలచూపులు చూస్తున్నాయి. 16వ వారం టీవీ 9, 1.45 రేటింగ్‌‌లో ఉంటే అది 18వ వారంలో 1.20కి పడిపోయింది. మిగతా చానల్స్‌‌తో పోల్చితే మొత్తం మీద టీవీ 9 వ్యూయర్‌‌షిప్ గణనీయంగా తగ్గినట్లు దీంతో తేలిపోయింది.

పలుచోట్ల జనసేన కార్యకర్తలు టీవీ9 ప్రసారాలను కేబుల్ ఆపరేటర్ల సాయంతో నిలిపివేయిస్తున్నట్లు సమాచారం. జనసైనికులు ప్రధానంగా టీవీ9ని చూడడమే లేదు. దీంతో ఒక్కసారిగా టీవీ 9 రేటింగ్స్ పడిపోయి బేరుమంటున్నాయి. ఉజ్జాయింపుగా ఆ చానల్ రేటింగ్ 18 శాతం దాకా పడిపోయిందని భావించవచ్చు.

పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు క్రొకడైల్ ఫెస్టివల్ ముందుందని హెచ్చరికలు చేస్తున్నారు. పవన్ జోలికి వస్తే దానికి ఫలితం అనుభవించక తప్పదని వారంటున్నారు. మీడియా విశ్లేషకులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

పవన్ కల్యాణ్ బహిష్కరణ పిలుపుతో పలు టీవీ చానళ్లు తమ తీరును ఇప్పుడు మార్చుకున్నాయి. అసభ్యకరమైన ప్రసారాలను, దుర్భాషలను తగ్గించాయి. పవన్ విషయంలో ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరిస్తున్నాయి. ఇదీ పవన్ ఎఫెక్ట్…. దటీజ్ పవన్!