పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు

08 October, 2019 - 2:08 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు శరన్నవరాత్రి మహోత్సవాలతో సంబరంగా మారాయని, బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ ఆడబిడ్డలు, బొమ్మల కొలువులతో ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు వేడుకగా దసరా పండుతను జరుపుకుంటున్న తరుణంలో తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగి తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ మనకు సాక్షీభూతంగా నిలుస్తోందని చెప్పారు. ఈ శుభ సందర్భంలో తెలుగు ప్రజలందరికీ ఆ జగన్మాత సుఖసంతోషాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.