యాత్రికుల దుర్మరణం బాధాకరం

16 October, 2019 - 12:12 AM

              (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన ఏడుగురు కర్ణాటక యాత్రికులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారేడుమిల్లి- చింతూరు ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో యాత్రికులు చనిపోవడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని జనసేనాని తెలియజేశారు.

ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాలకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రం వారైన బాధిత కటుంబాలకు అవసరమైన అన్ని సేవలు, సమాచారం అందించాలని అధికార యంత్రాగాన్ని ఆయన కోరారు. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న రోడ్లను రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలని, ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాలను పవన్ కల్యాణ్ కోరారు.