ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు

11 August, 2019 - 9:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ముస్లిం సోదరసోదరీమణులకు తన తరఫున, పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండగ త్యాగనిరతికి అర్థం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. మనోవాంఛలు, స్వార్థం, రాగద్వేషాలు వదిలి, మానవత్వాన్ని పెంపొందించుకోవాలనేది బక్రీద్ పండగ ఆంతర్యం అని పవన్ తెలిపారు. ఇది ముస్లిం మతం పాటించే భారతీయులందరికీ లక్ష్యంగా కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.