21న పంచాయతీ కార్యదర్శి పరీక్ష

15 April, 2019 - 5:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: పంచాయతీ కార్యదర్శి పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. సోమవారం అమరావతిలో ఉదయ్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ పంచయతీ కార్యదర్శి పరీక్ష ఆఫ్ లైన్ లోనే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆఫ్‌లైన్‌లో వడపోత పరీక్ష, మెయిన్స్ ఆన్‌లైన్‌లో ఉంటుందని వెల్లడించారు. గతేడాది నవంబర్ నుంచి 33 నోటిఫికేషన్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. నోటిఫికేషన్‌లో చెప్పిన తేదీల్లోనే పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

ఈబీసీ రిజర్వేషన్ల విధివిధానాలు తేలాక మిగతా నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. రెండు, మూడు నెలల్లో మిగిలిన నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. పోస్టుల నియామకాలను బట్టి కట్ ఆఫ్ మార్క్ నిర్ణయం ఉంటుందని ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు.