పరిగెడుతోన్న ‘బేబీ’

08 July, 2019 - 6:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెరిగెడుతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో రూ. 17 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ చిత్రం విజయం సాధించడంపై సమంత …. అద్భుతమైన వీకెండ్.

బేబీపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు అని ట్విట్టర్వ్ వేదికగా తెలిపింది. అలాగే ఈ చిత్రం విజయం సాధించడంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సమంతకు అభినందనలు తెలిపారు. అంతేకాదు.. ఓ మొక్కను కానుకగా ఇచ్చారు. దీనిని సైతం సమంత ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మీ,రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య అతిధి పాత్రలో మెరిశాడు.

ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ‘ఓ బేబి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి :
నైజాం : 2.26 కోట్లు
సీడెడ్ : 0.40 కోట్లు
వైజాగ్ : 0.69 కోట్లు
గుంటూరు : 0.33 కోట్లు
ఈస్ట్ : 0.29 కోట్లు
వెస్ట్ : 0.24 కోట్లు
కృష్ణా : 0.42 కోట్లు
నెల్లూరు : 0.12 కోట్లు