రామ్‌తో భార్గవ్

14 June, 2019 - 6:16 PM

(న్యూవేవ్స్ డెస్క్) 

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ్ రామ్ శుక్రవారం మొదటి పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పోస్ట్ చేశారు. చిన్న కుమారుడు భార్గవ్‌ను ఊయలపై నుంచో బెట్టి.. అతడినే ఎన్టీఆర్ చూస్తున్న ఫోటోతోపాటు పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన తమ్ముడి పక్కన కూర్చున్న ఫోటోను సైతం పోస్ట్ చేశారు. వీటికి భార్గవ్ తొలి పుట్టినరోజు అని క్యాప్షన్ ఇచ్చారు ఎన్టీఆర్.

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. తన కుటుంబంలోకి ఇంకొకరు వచ్చి చేరారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ .. ప్రస్తుతం రాజమౌళీ దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే వీరిద్దరికి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో షూటింగ్‌కి కొన్ని రోజులు విరామం ఇచ్చిన విషయం విదితమే. ఈ చిత్రం వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది.