కత్తి మహేష్‌పై తారక్ అసంతృప్తి?

09 September, 2017 - 10:57 AM


నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై క్రిటిక్ కత్తి మహేష్ గతకొద్ది రోజులుగా పలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. కానీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తున్న విషయంపై ఎన్టీఆర్ స్పందించినట్లుగా తెలుస్తోంది. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, మంచి వ్యక్తిత్వం, మనసున్న వ్యక్తి అని ఎన్టీఆర్ అన్నాడని తెలిసింది. అలాంటి వ్యక్తిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని.. అలా చేయకుండా వుంటే బాగుండేదని ఎన్టీఆర్ తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పుకొచ్చాడని తెలుస్తోంది.

కానీ పబ్లిక్‌గా మాత్రం ఈ వివాదంపై స్పందించలేదు. పబ్లిక్‌గా స్పందిస్తే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 10న శిల్పకళావేదికలో జరుపనున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేయనున్నారు.