30న భారీ సంగీత విభావరి

20 August, 2019 - 9:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : హైదరాబాద్‌లో తెలుగు సంగీతంపై తొలిసారి భారీ వేడుక నిర్వహించనున్నట్లు ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ భారీ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 30న జరగనున్న ఈ వేడకలో తనతోపాటు సింగర్స్ చిత్ర, ఏసుదాసు కూడా పాల్గొంటారన్నారు.

దాదాపు నాలుగు గంటల పాటు ఈ సంగీత విభావరి ఉంటుందని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విలేకర్లతో మాట్లాడుతూ… త్వరలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పాటలతో కూడా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వివరించారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు.

ప్రస్తుత సినిమ పాటలు వెర్రితలలు వేస్తుందని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. సింగర్స్‌కి సినిమానే గమ్యం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి తరం గాయనీ గాయకులకు ప్రతిభ ఉన్నప్పటికీ వృత్తిపరంగా నిలదొక్కుకోవడం ప్రశ్నార్థకరంగా మారుతోందని ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.