‘నిశ్శబ్దం’లో అంజలి

01 November, 2019 - 6:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. యూఎస్‌లో డిటెక్టివ్‌గా అంజలి నటిస్తోంది. ఈ నేపథ్యంలో అంజలి పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.

2020 జనవరి 24న ఈ  చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అందాల నటి అనుష్క పుట్టిన రోజు నవంబర్ 7. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ నవంబర్ 7న విడుదల చేసేందుకు ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని అనుష్క, మాధవన్ పోస్టర్‌లు విడుదల చేశారు. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ భార్య భర్తలుగా నటిస్తున్నారు. కాగా అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తోంది.

టీజీ విశ్వ ప్రసాద్‌ పీపుల్స్ మీడియా, కోన వెంకట్‌ కోన కార్పొరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, హాలీవుడ్ నటుడు మైఖేల్ మెడ్‌సన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ స్వరాలు సమకురుస్తున్నారు.

View this post on Instagram

#anjali as #Maha in #nishabdam

A post shared by Comedy Cube (@comedycube_) on