మళ్లీ.. మళ్లీ.. మళ్లీ

11 August, 2019 - 9:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరో నేచురల్ స్టార్ నానీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించినవే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రం ‘V’. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రంలో నాని పాత్రకు సంబంధించిన ఫొటోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా.. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నానీకి ఇది 25వ చిత్రం. నేచురల్ స్టార్ నానీ హీరోగా నటించిన తొలి చిత్రం అష్టా చమ్మాకి కూడా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణే.

మరోవైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.