విక్రమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్

30 November, 2018 - 2:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని. సిద్ధార్థ హీరోలుగా నటించనున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కథను ఇప్పటికే ఈ హీరోలిద్దరికి విక్రమ్. కె. కుమార్ వివరించారట. ఈ చిత్రంలో నటించేందుకు వారిద్దరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట.

అయితే ఆఫ్ స్క్రీన్‌లో వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రంలో మాత్రం వీళ్లిద్దరు విరోధులుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నాచురల్ స్టార్ నాని ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందంట. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. అలాగే సిద్ధార్థ నటించిన చివరి చిత్రం గృహం. ఈ చిత్రం 2017లో విడుదల అయింది.

అయితే విక్రమ్ కె కుమార్.. గతంలో నితిన్ హీరోగా ఇష్క్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన అక్కినేని ఫ్యామిలీ నటించిన చిత్రం మనం. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాదు… ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలచుకుంది. అలాగే ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది. అనంతరం అఖిల్ అక్కినేని హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటంచిన చిత్రం హల్లో. ఈ చిత్రానికి విక్రమ్ దర్శకత్వం వహించిన విషయం విదితమే.