దేవదాస్‌ వచ్చేస్తున్నారు….

08 August, 2018 - 7:28 PM

(న్యువేవ్స్ డెస్క్)

సి.ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం`దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని ఈ ఫ‌స్ట్‌లుక్‌ను త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా … “టైటిల్ ప్ర‌కారం నా ప‌క్క‌న పారు ఉండాలి. కానీ నా ప‌క్క‌న ఈ దాసుగాడు ఉన్నాడు. దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. సినిమా ఫ‌న్ రైడ్‌గా ఉంటుంది“ అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్‌ను నాగార్జున విడుద‌ల చేశారు.

“1996లో `నిన్నేపెళ్లాడ‌తా` విడుద‌లైన‌ప్పుడు నాగ్ సార్ స్క్రీన్‌పై ఉంటే నేను దేవి 70 ఎం.ఎం థియేట‌ర్ క్యూలో ఉన్నాను. 2018లో ఇద్ద‌రం క‌లిసి దేవ‌దాస్ ఫ‌స్ట్‌లుక్‌లో ఉన్నాం“ అంటూ నేచుర‌ల్ స్టార్ నాని ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

చిత్ర నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ .. క్లైమాక్స్ మిన‌హా `దేవ‌దాస్` షూటింగ్ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 27న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్త్తామన్నారు. అన్నారు.

గతంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సెప్టెంబ‌ర్ 1న శుభ‌ల‌గ్నం, సెప్టెంబ‌ర్ 27న స్టూడెంట్ నెం.1, సెప్టెంబ‌ర్ 28న చిరుత సినిమాలు విడుద‌లై ఘ‌న విజ‌యాన్నిసాధించాయి. అదే క్రమంలో సెప్టెంబ‌ర్ 27న ఈ `దేవ‌దాస్‌` ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ దేవదాస్ చిత్రంలో కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని, ర‌ష్మిక మండ‌న్నా, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వి.కె, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ‌ స్వరాలు సమకుర్చుతున్నారు.