‘ఓ డియర్’కు అమిత్ సంగీతం

13 March, 2020 - 8:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఓ డియర్. ఈ చిత్రం సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని ఖరారు చేశారు. అమిత్ త్రివేది ఇప్పటికే సైరా నరసింహరెడ్డి, నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న ‘వి’ చిత్రాలకు సంగీతం అందించారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. అందులోభాగంగా ఈ చిత్రంలోని పలు చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

అలాగే జార్జియాలో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోనుంది. జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదలకానుంది. అయితే మార్చి 25 ఉగాది పండగ… ఈ నేపథ్యంలో ఈ చిత్రంఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రభాస్ గతంలో నటించిన సాహో చిత్రం ఘోర పరాజయం చవిచూసిన విషయం విదితమే.