చంద్రబాబుకు ముద్రగడ మళ్లీ లేఖ!

08 May, 2018 - 12:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కిర్లంపూడి (తూ.గో.జిల్లా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ లేఖ రాశారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో ఏపీ నుంచి మహారాష్ట్రకు దళితుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్ళు నడపాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్ పుట్టిన గ్రామమైన మహారాష్ట్రలోని మౌహంను ఆయన జయంతి సందర్భంగా దళితులు దర్శించుకుంటారు. అంతేకాక ప్రతి జిల్లా నుంచి కనీసం 30 బోగీలు ఉన్న రైళ్ళను ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నడపాలని ముద్రగడ అన్నారు.

రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని మీ కడుపు నుంచి కాకపోయినా.. పెదాల నుంచి వచ్చినందుకైనా సంతోషం అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులగా స్మృతివనం ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.