ఫస్ట్ లుక్‌లో ‘పూజా’

14 February, 2020 - 8:01 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’నే ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే జంటగా నటిస్తున్నారు. అయితే శుక్రవారం ప్రపంచ ప్రేమికుల దినోత్సవం.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా బ్యాగ్ తలిగించుకుని.. రెండు చేతులతో షూస్ పట్టుకుని పైకి పెట్టి నుంచోవడం కాస్త వెరైటీగా ఉంది. కాగా ఇప్పటికే హీరో అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ లో రహదారిపై కాళ్లకు ఏమీ లేకుండా.. తలకి టోపి పెట్టుకుని మెడకు స్కార్ఫ్ పెట్టుకుని నడుచుకుంటూ అఖిల్ వెళ్లడం సింపిల్ సిటికి అద్దం పడుతున్నట్లు ఉంది.

ఇక ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.  ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోపి సుందర్ సంగీత అందిస్తున్న ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్ ఫిక్చర్సు బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అల.. వైకుంఠపురంలో.. సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా పూజా హెగ్డే నటిస్తుంది. కాగా ఇప్పటికే అఖిల్ అక్కినేనికి సరైన హిట్ చిత్రం లేకుండా పోయింది. అతడు నటించిన అఖిల్, హాల్లో, మిస్టర్ మజ్నూ చిత్రం అశించినంత విజయం సాధించలేదన్న సంగతి తెలిసిందే.