‘మెర్క్యురీ’ మూవీ రివ్యూ..!

13 April, 2018 - 5:47 PM

సినిమా: మెర్క్యూరీ
జానర్: సైలెంట్‌ హర్రర్‌ థ్రిల్లర్‌
నటీనటులు: ప్రభుదేవా, సనంత్‌‌రెడ్డి, దీపక్ పరమేష్‌, శశాంక్‌ పురుషోత్తం, అనీష్‌ పద్మనాభన్‌, ఇందుజా, గజరాజ్‌, ర‌మ్య నంబీశ‌న్.
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
తెలుగు విడుద‌ల‌: కె.ఎఫ్‌.సి ప్రొడ‌క్షన్స్‌
చాయాగ్రహ‌ణం: తిరునావుక్కర‌సు
కూర్పు: వివేక్ హ‌ర్షన్‌
నిర్మాత‌లు: జ‌యంతి లాల్‌, కార్తికేయ‌న్ సంతానం
క‌థ‌, స్క్రీన్‌‌ప్లే, ద‌ర్శక‌త్వం: కార్తీక్ సుబ్బరాజు.

సాంకేతికంగా సినిమా ఎంతో అభివృద్ధి చెందింది. సౌండింగ్‌‌లో కొత్త టెక్నాల‌జీలు ఎన్నో వ‌స్తున్నాయి. టాకీ సినిమాలు వ‌చ్చిన త‌ర్వాత మూకీ సినిమాలు ఉంటాయ‌నేది ప్రేక్షకులు ఎప్పుడో మ‌రిచిపోయారు. 30 ఏళ్ల క్రితం క‌మ‌ల్‌‌హాస‌న్‌, సింగీతం శ్రీనివాస‌రావు క‌లిసి `పుష్పక విమానం` చేశారు. అప్పట్లో సినిమా ట్రెండ్‌‌కు భిన్నంగా ఉంద‌ని మంచి విజ‌యం సొంతం చేసుకుంది.

30 ఏళ్ల త‌ర్వాత `పిజ్జా` ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ మూకీ సినిమాతో ప్రేక్షకుల‌ను మెప్పించే ప్రయ‌త్నం చేశారు. ఆ సినిమాయే `మెర్క్యురి`. ఇది మూకీ సినిమా కావ‌డం ఒక విశేషం అయితే ఇందులో ప్రభుదేవా విల‌న్‌‌గా న‌టించ‌డం మ‌రో విశేషం. మ‌రి థ్రిల్లర్ జోన‌ర్‌‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూకీ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుందా? లేదా? తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్ళాలి.క‌థ‌: మాట‌లు రాని, వినిపించ‌ని స‌మ‌స్యతో బాధ‌ప‌డే ఐదుగురు స్నేహితులు ఓ గెస్ట్‌హౌస్‌‌లో బ‌ర్త్‌‌డే పార్టీ చేసుకుంటారు. పార్తీ పూర్తయిన త‌ర్వాత తిరుగు ప్రయాణంలో వారు ఓ వ్యక్తిని కారుతో గుద్దేసి చంపేస్తారు. చ‌నిపోయిన వ్యక్తి గుడ్డివాడైన ప్రభుదేవా. అత‌న్ని స్నేహితులంద‌రూ క‌లిసి ఓ పాడుబ‌డిన ఫ్యాక్టరీకి తీసుకెళ్లి పాతిపెడ‌తారు. త‌ర్వాత రోజు ఆ శవం పాతిపెట్టిన చోట క‌న‌ప‌డ‌దు. అలాగే ఐదుగురు స్నేహితుల్లో ఒక అమ్మాయి క‌న‌ప‌డ‌దు. ఇంత‌కు ఆ శ‌వం ఏమైంది? మాయ‌మైపోయిన అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అస‌లు గుడ్డి వ్యక్తి చ‌నిపోకుండా? ప్రతీకారం తీర్చుకున్నాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:
మూకీ సినిమాను ఏ యాంగిల్‌‌లో తెర‌కెక్కించాన‌నే దానిపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చాలా తెలివిగా ప్రవ‌ర్తించారు. పాత్రల‌కు మాట‌లు రావు.. చెవులు విన‌ప‌డ‌వు అని అన‌డంతో క‌థ వారి కోణంలో ఉంటుంది కాబ‌ట్టి సినిమా మూకీ అనిపిస్తుంది. ప్రభుదేవాతో పాటు న‌టించిన అంద‌రూ కొత్తవారు. కొత్తవారు కావ‌డంతో వారు తెలుగు ప్రేక్షకులకు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతార‌నేది సందేహంగా మారింది. ముఖ్యంగా ఇప్పటి వ‌ర‌కు నెగెటివ్ షేడ్‌‌లో న‌టించ‌ని ప్రభుదేవా తొలిసారి ఆ విధంగా న‌టించ‌డం సినిమాకు ప్రధాన‌మైన బ‌లాన్ని చేకూర్చింది. సినిమాను ఎక్కువ‌గా లాగ‌కుండా ఓ ప‌రిమిత స‌మ‌యంలో చెప్పే ప్రయ‌త్నం చేశారు దర్శకుడు. తిరునావుక్కర‌సు సినిమాటోగ్రఫీ, సంతోశ్ నారాయ‌ణ నేప‌థ్య సంగీతం సినిమాకు ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. మూకీ సినిమా తీయాల‌నే ప్రయ‌త్నం బావున్నా.. బ‌ల‌మైన క‌థ, క‌థ‌నం లేదు. సినిమా మొదలైన కొంతసేప‌టికే క‌థ రివీల్ కావ‌డంతో సినిమాపై ఉన్న ఆస‌క్తి ప్రేక్షకుడికి స‌న్నగిల్లుతుంది. ర‌సాయ‌న కంపెనీల వ‌ల్ల క‌లిగే చెడు ప్రభావాల‌ను అంత‌ర్లీనంగా ద‌ర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ చక్కగా చెప్పారు.

అస‌లు గుడ్డి వ్యక్తి చ‌నిపోకుండా? ప్రతీకారం తీర్చుకున్నాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.దక్షిణాదిలో సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలు రూపొందించే డైరెక్టర్లలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు మంచి క్రేజ్ ఉంది. షార్ట్‌ ఫిలింలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టిన కార్తీక్ పిజ్జా చిత్రంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఆ తర్వాత తమిళంలో జిగర్తాండా, ఇరైవీ చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించిపెట్టాయి.
మెర్కురీ చిత్రం భావోద్వేగాంశాలు కలబోసిన ఓ మూకీ చిత్రం. పాత్రధారుల నటనే ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు. కమర్షియల్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల అభిరుచికి ఈ సినిమా దూరంగా ఉంటుంది. అన్నివర్గాలను ఈ సినిమా ఆకట్టుకోలేకపోవచ్చు. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే కొంత మంది ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.ప్లస్ పాయింట్స్‌:
– ప్రభుదేవా లుక్‌, నటన
– కార్తీక్‌ సుబ్బరాజ్‌ టేకింగ్‌
– నేప‌థ్య సంగీతం
– సినిమాటోగ్రఫీ
మైన‌స్ పాయింట్స్‌:
– క‌థ‌లో కొత్తదనం లేదు
– తెలుగు ప్రేక్షకులకు క‌నెక్ట్ అవడం కష్టం.