స్టైలిష్ స్టార్ షూటింగ్ సెట్లో మెగాస్టార్!

16 April, 2018 - 2:40 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రంలోని సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ 7 ఏకర్స్ స్టూడియోలో వేసిన గ్రాండ్ సెట్లో జరుగుతోంది. ఈ సాంగ్ సెట్లోకి ఆకస్మికంగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. బన్నీ డాన్స్ చేస్తున్నంత సేపు చిరు ఎంజాయ్ చేశారు. సాంగ్ తనకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్‌తో కలిసి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజివితో పాటు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ కూడా వచ్చారు.

మరోవైపు బ్యూటిఫుల్ లవ్ అంటూ సాగే పాటను ఈ మధ్యే నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష శ్రీధర్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నెల 22న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేస్తున్నారు. 29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. మే 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.