నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ కంప్లీట్

12 January, 2018 - 3:37 PM

మెగా ఫ్యామిలీ డాటర్ నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ అయిపోయింది. హ్యాపీ వెడ్డింగ్ అంటే ఆమెకు నిజంగానే పెళ్ళయిపోయిందేమో అనుకునేరు.. ఇది ఆమె నటిస్తున్న రెండో తెలుగు సినిమా. ‘ఒక మనసు’ చిత్రం ద్వారా నిహారిక హీరోయిన్‌గా కెరీర్ ప్రారంచారు. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో నిహారిక గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత ఓ తమిళ సినిమా చేస్తూనే.. మరో వైపు తెలుగులో ‘హ్యాపీ వెడ్డింగ్’ మూవీలో కూడా నటించింది. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు.రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టయినర్‌‌గా హ్యాపీ వెడ్డింగ్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం షూటింగ్ ముగియడంతో నిహారిక తన సోషల్ మీడియా పేజీలో ఈ మూవీకి సంబంధించిన విషయాలు, ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రేమ- పెళ్లి అనే పాయింట్ ఆధారంగా మంచి కుటుంబ కథా చిత్రంగా హ్యాపీ వెడ్డింగ్ మూవీని తెరకెక్కించారు. అబ్బాయి, అమ్మాయి పట్నంలో చదువు, ఉద్యోగం.. పెళ్లి మాత్రం తమ కుటుంబం సొంత ఊరైన పల్లెటూరిలో.. ఈ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కించినట్లు సమాచారం.హ్యాపీ వెడ్డింగ్ సినిమా ద్వారా లక్ష్మణ్ కర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి ఫీల్ గుడ్ మూవీగా, కుటుంబ బంధాలతో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కలగలిపి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఈ మెగా డాటర్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన నేపథ్యంలో మంచి అంచనాలే వస్తున్నాయి. మరో వైపు ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘యూవీ క్రియేషన్స్’ నిర్మించడం కూడా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది.