వారానికో ‘పాట’

29 November, 2019 - 6:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ చిత్ర ప్రమోషన్ కోసం సరికొత్త వ్యూహన్ని రచించింది ఈ చిత్ర యూనిట్. అందులోభాగంగా ఈ చిత్రంలోని అయిదు పాటలు ఉన్నాయి. వాటిని డిసెంబర్‌ మాసంలో వచ్చిన సోమవారాలు అంటే.. 2, 9, 16, 23, 30వ తేదీల్లో విడుదల చేయాలని నిర్ణయించింది.

దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తొలి సారిగా మహేశ్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటి విజయశాంతి నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్, సంగీత, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో మేజర్ అజేయ్ కృష్ణగా ఆర్మీ అధికారి పాత్రలో మహేశ్ బాబు ఒదిగిపోయి నటిస్తున్నారు. భరత్ అనే నేనులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించగా… పోకిరి, దూకుడు చిత్రాల్లో మాత్రం పోలీసు అధికారి పాత్రలో మహేశ్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.