టీజర్‌లో ‘మన్మథుడు 2’

13 June, 2019 - 2:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. ఈ చిత్ర టీజర్ గురువారం విడుదల అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున కోడలు సమంతా అక్కినేని అతిథి పాత్రలో నటిస్తుంది.

నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ, ఝాన్సీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, దేవదర్శిని తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

గతంలో నాగార్జున అక్కినేని, సోనాలి బింద్రే జంటగా నటించిన చిత్రం మన్మథుడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే మన్మథుడు 2 చిత్రంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.