అవంతిక…

09 July, 2019 - 4:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన అవంతిక పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. రకుల్ ప్రీత్ సింగ్‌ని చూపిస్తూ.. అవంతిక.. పేరే ఎంత వినసొంపుగా ఉంది.. అంతే పద్ధతి గల అమ్మాయి అంటూ సీనియర్ నటి లక్ష్మీ పలికే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది.

ఈ చిత్రంలో రకుల్ విభిన్న పాత్రల్లో కనిపించనుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, లక్ష్మీ , రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని కీలక పాత్రల్లో నటించగా.. సమంతా అక్కినేని, కీర్తి సురేష్‌ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.