‘మంచు కురిసే వేళలో’ ఫస్ట్ లుక్ విడుదల

03 November, 2018 - 6:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బాల బోడెపూడి దర్శకత్వంలో రామ్ కార్తీక్, ప్రణాలి జంటగా నటిస్తున్న చిత్రం మంచుకురిసే వేళలో… . ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు బాల బోడెపూడి మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని అందమైన లోకేషన్లలో అంతే అందమైన కథ కథనాలతో తెరకెక్కించిన స్వచ్ఛమైన ప్రేమ కథ అని ఆయన అభివర్ణించారు. ఈ చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయన్నారు. అలాగే ఈ చిత్ర హీరో రామ్ కార్తీక్‌కు ఇది ఉత్తమ చిత్రం అవుతుందన్నారు. ఈ నెలలలోనే ఆడియోను.. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.

 

ప్రముఖ దర్శకుడు దేవా కట్టా వద్ద దర్శకత్వ శాఖలో బాలా బోడేపూడి పని చేశారు. బాలా బోడేపూడి స్వీయ దర్శకత్వంలో మంచు కురిసే వేళలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బాలా బోడేపూడి దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకుడు బాలా బోడేపూడి.