మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలేశారు!

11 January, 2018 - 10:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: బస్సులో ప్రయాణిస్తూ మృతి చెందిన ఓ వ్యక్తిని డ్రైవర్‌, కండక్టర్‌ ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన తమిళనాడులోని సూళగిరి సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ధీరన్ (55)‌, రాధాకృష్ణన్‌ (44) అనే ఇద్దరు స్నేహితులు బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సుల్లో బెంగళూర్‌ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రూ.300 ఇచ్చి తమిళనాడులోని తిరువళ్లూర్‌కు రెండు టికెట్లు తీసుకున్నారు. మార్గమధ్యంలో ధీరన్‌కు తీవ్ర గుండెపోటు వచ్చింది. అంతలోనే అతను తుదిశ్వాస విడిచాడు. ఆ విషయాన్ని గమనించిన డ్రైవర్, కండెక్టర్ ఏ మాత్రం కనికరం చూపకుండా ధీరన్ మృతదేహాన్ని బస్సులోంచి కిందకు దింపి వెళ్లిపోయారు. ఈఘటనతో దిక్కుతోచని ధీరన్ మిత్రడు రాధాకృష్ణన్‌ స్ధానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ ఏర్పాటు చేసి ధీరన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.