‘మళ్లీ రావా’ మూవీ రివ్యూ

08 December, 2017 - 3:36 PM

సినిమా : ‘మళ్ళీ రావా’
నటీనటులు : సుమంత్, ఆకాంక్ష సింగ్  తదితరులు
దర్శకుడు : గౌతమ్ తిన్ననూరి
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
విడుదల తేది : డిసెంబర్ 08, 2017.

‘నరుడా డోనరుడా’ తర్వాత అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ రావా’. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌. నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ఇందులో కార్తీక్ పాత్రలో సుమంత్, అంజలి పాత్రలో ఆకాంక్ష సింగ్‌ నటించారు.

9వ తరగతి చదివే సమయంలో తన తోటి స్టూడెంట్ అంజలితో ప్రేమలో పడతాడు కార్తీక్. ఈ విషయం ఇద్దరి ఇంట్లోని పెద్దలకు తెలియడంతో వాళ్లను మందలిస్తారు. ఆ తర్వాత అంజలి ఫ్యామిలీ ఆ ఊరి నుంచి వెళ్లిపోతారు. 13 ఏళ్ల తర్వాత కార్తీక్ పనిచేస్తున్న కంపెనీలోనే అంజలి కూడా చేరుతుంది. కార్తీక్ ప్రేమను అర్థం చేసుకున్న అంజలి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. పెళ్లి సమయంలో తనకు పెళ్లి ఇష్టం లేదంటు వెళ్లిపోతుంది. అసలు అంజలి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? ఎందుకు పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయింది? మళ్లీ కార్తీక్ జీవితంలోకి అంజలి ఎందుకొచ్చింది? చివరకు మళ్లీ వీరిద్దరూ కలిసారా లేదా అనేది ‘మళ్లీరావా’ కథాంశం.

కార్తీక్ పాత్రలో సుమంత్ చాలా బాగా చేసాడు. తన హవభావాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్‌ బాగా చూపించాడు. నటుడిగా సుమంత్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక అంజలి పాత్రలో ఆకాంక్ష సింగ్ బాగా చేసింది. కొన్ని కొన్ని సీన్లలో అదరగొట్టేసింది. లుక్స్ పరంగా ఇద్దరి జోడి బాగుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రేమకథను కొత్తగా చూపించాలని ప్రయత్నించాడు. తన ప్రేమకు దూరంగా వెళుతున్న అంజలిని చూసి కార్తీక్ ఎలాంటి కారణం అడగకుండా తన పరిస్థితులను అర్థం చేసుకుంటూ వుండే ఓ స్వచ్ఛమైన ప్రేమికుడిగా బాగా చేసాడు సుమంత్. ప్యూర్ లవ్‌స్టోరీ అంటూ చాలా సినిమాలొస్తాయి కానీ… ఆ లవ్‌స్టోరీలో స్వచ్ఛత తక్కువ. కానీ ఈ సినిమాలో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ విత్ మిక్స్‌డ్ ఫీలింగ్స్ కూడా వున్నాయి.

కానీ ఇలాంటి లవ్‌స్టోరీలో ఎంత స్పీడ్‌ వుంటే అంత బాగుంటుంది. ఎమోషనల్ ఎక్కువై, లాగ్ పెరిగితే చూసే ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే ఈ సినిమాకు ఏర్పడింది. సినిమా స్టోరీ బాగున్నా… స్క్రీన్‌ప్లే పరంగా సాగదీసినట్లుగా అనిపిస్తోంది. అక్కడక్కడ కాస్త ఎంటర్‌టైన్మెంట్ అంశాలున్నా కూడా లవ్‌స్టోరీలో ఎక్కువ ఎమోషన్స్ వుండటం వల్ల చూసే ప్రేక్షకులకు బోరింగ్‌గా అనిపిస్తోంది. కానీ దర్శకుడిగా మాత్రం గౌతమ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరికాస్త కటింగ్ పడుంటే బాగుండేది. చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా ‘మళ్లీ రావా’ ఒక బ్యూటీఫుల్ ప్రేమకథా చిత్రమని చెప్పుకోవచ్చు.