దూసుకుపోతున్న ‘మజిలీ’

15 April, 2019 - 2:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నాగచైతన్య, సమంత మూడు ముళ్లు పడిన తర్వాత జంటగా నటించిన తొలి చిత్రం మజిలీ. ఈ చిత్రం ఇటీవల విడుదల అయి.. సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాదు.. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ మజిలీ చిత్రం తాజాగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూల్ సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే సమంత నటన ఈ చిత్రానికే ఓ హైలెట్‌గా నిలిచింది. అదీకాక.. ఈ చిత్రానికి యూవతే కాకుండా.. ఫ్యామిలీ అడియాన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు.

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. గతంలో సమంతా, చైతన్య జంటగా ఏం మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.