ప్రిన్స్ ఫ్యాన్స్‌కి శుభవార్త

06 February, 2019 - 5:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ‌కి అదిరిపోయే శుభవార్త. మహేశ్ బాబు విగ్రహం హైదరాబాద్‌లో దర్శనం ఇవ్వనుంది. అదీకూడా మహేశ్ బాబు నిర్మించిన మల్టీఫెక్స్ ఏఎంబీ సినిమా థియేటర్‌లో .. ఇదేంటి అనుకుంటున్నారా? ఇప్పటికే మేడమ్ టూసాడ్స్ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి రూపంలోని ప్రభాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

దక్షిణ భారతదేశంలో ఈ అరుదైన గౌరవం పొందిన తొలి నటుడు ప్రభాస్. అలాగే ప్రిన్స్ మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని కూడా మేడమ్ టూసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సదరు విగ్రహం ఇప్పటికే సింగపూర్‌లో తయారు అయింది.

అయితే ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి విమానంలో హైదరాబాద్ తీసుకువచ్చి… ఓ రోజు ఏఎంబీ థియేటర్‌లో ఉంచుతారు. ఆ క్రమంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ .. ఈ మైనపు విగ్రహంతో సెల్పీ తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా ఈ విగ్రహం ఫిబ్రవరి చివరి వారంలో వస్తుందని సమాచారం. అయితే ఆ తర్వాత ఈ విగ్రహన్ని లండన్‌లోని మేడమ్ టూసాడ్స్ మ్యూజియంకి తీసుకు వెళ్తారు. ఈ మేరకు ప్రిన్స్ మహేశ్ బాబు సతీమణి.. నమ్రత పేర్కొన్నారు.