మహేశ్ సినిమా ‘సీక్వెల్’

08 February, 2019 - 3:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్‌లో ముందు చూపు ఉన్న హీరోల్లో ప్రిన్స్ మహేశ్ బాబు ముందు వరసలో ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇటు సినిమాలే కాదు.. అటు యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నారు. అయితే ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్ర షూటింగ్ పూర్తి అవుతున్న నేపథ్యంలో మరో చిత్రంలో నటించేందుకు మహేశ్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా ఎఫ్‌2 చిత్రంతో విజయం అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయనతో ఇటీవల ప్రిన్స్ మహేశ్ బాబు భేటీ.. దూకుడు చిత్రం సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందని అని ఆలోచన చేశారట. అలాగే దూకుడు చిత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా సీక్వెల్ తీస్తే… మరింత హిట్ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే దూకుడు చిత్రం తర్వాత మహేశ్ బాబు హీరోగా వచ్చిన చిత్రం ఆగడు. ఈ చిత్రం సీక్వెల్ కూడా తీస్తే.. అది కూడా హీట్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుకున్నారట. అయితే దూకుడు 2 చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వైరల్ అవుతుంది.