మహేష్ ‘మహర్షి’

10 August, 2018 - 4:53 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మహేష్ 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కౌంట్ డౌన్ అంటూ కొన్ని లెటర్స్ విడుదల చేయడం.. ఆ లెటర్స్ అన్ని కలిపితే రిషి అని పేరు రాడంతో అంతా చిత్ర టైటిల్ అదే అనుకున్నారు. కానీ రిషి జర్నీ అంటూ తాజాగా మహేష్ 25వ చిత్రానికి సంబంధించిన టైటిల్ మహర్షిగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌లో మహేష్‌ని చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ ఈ లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అలాగే మహేష్ ఇప్పటి వరకు చేసిన 24 సినిమాల లుక్స్ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో లుక్ మాత్రం అదుర్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.