మహర్షి.. సెకండ్ సాంగ్

11 April, 2019 - 9:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వంశీపైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈ చిత్రం నుంచి రెండో పాట నువ్వే సమస్తం… అంటే సాగే వీడియో సాంగ్‌ను ఏప్రిల్ 12వ తేదీ అంటే శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది.

అందుకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. మహర్షి చిత్రంలో మహేశ్ బాబు రిషి పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మే 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మహర్షి చిత్రం తొలి పాటతోపాటు టీజర్‌కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.