దూసుకుపోతున్న ‘మహర్షి’

16 May, 2019 - 7:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదలై.. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ చిత్రం విడుదలై వారం రోజుల్లో కలెక్షన్ల పరంగా రూ. 200 కోట్ల మార్కును దాటింది.

అయితే మహేశ్ బాబు ఇంతకుముందు నటించిన భరత్ అనే నేను చిత్రం విడుదలై వారం రోజుల కలెక్షన్ల కంటే.. ఈ మహర్షి చిత్రానికి వచ్చిన కలక్షన్ల షేర్ ఎక్కవ అని సినీ పండితులు పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్, జగపతి బాబు, జయసుధ, ప్రకాశ్ రాజ్, కమల్ కమరాజు, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు.