సెప్టెంబర్ 16న ‘మ‌హానుభావుడు’ పాటలు విడుదల

13 September, 2017 - 3:03 PM


శ‌ర్వానంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మ‌హానుభావుడు’. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈచిత్ర ఆడియోను సెప్టెబర్ 16న విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌ తదిత‌రులు.

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌; సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి; ఆర్ట్‌-రవింద‌ర్‌; ఫైట్స్‌-వెంక‌ట్‌; ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు; కొరియోగ్రఫి : రాజు సుందరం; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, కె.కె; ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌; కో-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌; నిర్మాతలు – వంశీ, ప్ర‌మోద్‌; కథ, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం – మారుతి.