ట్రైలర్‌లో ‘మామాంగం’

09 November, 2019 - 6:28 PM

(న్యూవేవ్స్  డెస్క్)

ప్రముఖ నటుడు మమ్ముటి నటిస్తున్న చిత్రం మామాంగం. ఈ చిత్ర ట్రైలర్ శనివారం విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ చూసిన ప్రముఖ నటుడు నాగార్జున తన ట్విట్టర్ వేదికగా ఇలా స్పందించారు.  2 నిమిషాల 24 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో మమ్ముటి యుద్ధ వీరుడిగా కనిపించారన్నారు. ఇది నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర కథ దాదాపు 280 ఏళ్ల క్రితం చోటు చేసుకుందని ఆయన చెప్పారు. మామాంగం అనేది కేరళలోని ఆ ప్రాంత పండగ అని ఆయన తెలిపారు. ఈ చిత్రం ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీలో కూడా విడుదల చేస్తున్నారని.. అయితే ఇలా ఇన్ని భాషల్లో తెరకెక్కుతోన్న తొలి మలయాళ చిత్రం ఇదే అని నాగార్జున చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం జయచంద్రన్ అందించగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను సంచిత్ బల్హర్, అకింత్ బల్హర్ అందించారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుంద్, ప్రాచీ తెహ్లాన్, సిద్దిఖీ, అచ్యుతన్, అనుసితార్, తరుణ్ అరోరా, సురేశ్ కృష్ణ, ముణి కుట్టన్, సుదేవ్ నాయర్ ముఖ్యపాత్రల్లో నటించారు.