ఆటోను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

17 April, 2018 - 12:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కర్నూలు: బనగానపల్లె మండలం కొత్తపేటలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు తగిలాయి. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ రాంచంద్రుడు (30)తో పాటు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి.మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ (14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు (14)గా గుర్తించారు. వీరిద్దరూ కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ పల్టీ కొట్టి పక్కనున్న పొలాల్లో బోల్తా పడింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.