మెగాస్టార్ సరికొత్త లుక్ ఇదే గురూ..!

13 January, 2018 - 3:18 PM

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. రెండో షెడ్యూల్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లుక్ కోసం మెగాస్టార్ కొంత కాలంగా గెడ్డం, కోరమీసాలతో కనిపించారు. ఇటీవల జరిగిన షూటింగ్‌లో కూడా చిరు అదే లుక్‌లో పాల్గొన్నారు. కానీ తాజాగా మెగాస్టార్ క్లీన్‌గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. శనివారం జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి గెడ్డం, మీసం లేకుండా కనిపించారు.న్యూ ఇయర్ వేడుకల సమయంలో గెడ్డం లేకుండా కనిపించిన చిరు తరువాత గ్రాఫిక్స్ వర్క్‌ కోసం మీసం కూడా తీసేశారట! రెండో షెడ్యూల్‌ ప్రారంభం అవడానికి మరికొంత సమయం ఉండటంతో ఈ లోగా గ్రాఫిక్స్‌‌కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం చిరు ఈ న్యూ లుక్‌‌లోకి మారారని సమాచారం. సైరా నరసింహారెడ్డి సినిమా రెండో షెడ్యూల్‌ త్వరలో పొల్లాచ్చిలో ప్రారంభం అవుతుంది.