కొనసాగుతోన్న రెండో దశ పోలింగ్

18 April, 2019 - 3:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ గురువారం మొదలైంది. ఈ దశలో 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ జరగనుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4.00 గంటల ముగియనుంది.

ఇక తమిళనాడులోని మదురైలో అమ్మవారి ఉత్సవాలు జరగుతున్న నేపథ్యంలో.. అక్కడ మాత్రం రాత్రి 8.00 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ రెండో దశలో 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 1,583 మంది అభ్యర్థులు ఉన్నారు.

మధ్యాహ్నం 1.00 గం. వరకు అసోంలో 46.76 శాతం, బిహార్‌లో 38.87 శాతం, జమ్ము కశ్మీర్‌లో 30.15 శాతం , కర్ణాటకలో 36.32 శాతం, మహారాష్ట్రంలో 32.75 శాతం, మణిపూర్‌లో 50.29 శాతం పోలింగ్, ఒడిశాలో 31.88 శాతం, తమిళనాడులో 37.86 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 38.48 శాతం, బెంగాల్‌లో 51.68 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 47.02 శాతం, పుదుచ్చేరిలో 41.92 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో పలు చోట్లు ఈవీఎంలు అప్పటికప్పుడు  మార్చారు.