గవాస్కర్ నాగిని డ్యాన్స్!

19 March, 2018 - 5:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కొలంబో: నిదాహాస్‌ ముక్కోణపు టీ 20 సీరీస్‌ ఫైనల్‌‌లో బంగ్లాదేశ్‌ ఓటమి సంగతి ఎలా ఉన్నా.. గత మ్యాచ్‌‌లో వాళ్లు చేసిన నాగిని స్టెప్పులే వాళ్ల పాలిట ఇప్పుడు విలన్‌‌గా మారాయి. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా బంగ్లా ప్లేయర్లను ట్రోలింగ్‌‌తో ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ (68) వేసిన నాగిని స్టెప్పు వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
మ్యాచ్‌ 9వ ఓవర్లో ఉండగా కామెంటరీ బాక్స్‌‌లో ఉన్న గవాస్కర్‌.. రోహిత్‌ బ్యాటింగ్‌ ధాటిని చూసి ఆపుకోలేకపోయాడు. తాను కూర్చున్న కుర్చీ నుంచి అమాంతం లేచిన గవాస్కర్ నాగిని స్టెప్పు వేసేశాడు. అది చూస్తూ మిగతా ఇద్దరు కామెంటేటర్లు పడి పడి నవ్వుకున్నారు.

అఫ్‌‌కోర్స్‌ ఆ వీడియోను లైవ్‌‌లో చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో చూస్తున్న వాళ్లు సరదాగానే తీసుకుని కామెంట్లు చేస్తున్నారు. కానీ, బంగ్లా క్రికెట్‌ అభిమానులకు మాత్రం అది ఏ మాత్రం రుచించలేదు. ‘దిగ్గజ ఆటగాడు మర్యాదగా వ్యవహరించలేదంటూ కొందరు మండిపడుతుంటే.. ఆయన అలా చేయటం సరికాదంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. గవాస్కర్ చేసింది రైటా? రాంగా? అనేది పక్కనపెడితే బంగ్లా ఆటగాళ్లు చేసిన పనికి వాళ్లపై మంటతో ఉన్నవాళ్లకు ఆ వీడియో తెగ కిక్కునిస్తోందనే చెప్పుకోవచ్చు.