ఇడిగో చిన్న అల్లుడు

12 January, 2019 - 4:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడు ఇటీవల విడుదల అయి.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కానుంది. అయితే వీటికి భిన్నంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రం జనవరి 25న విడుదల చేస్తానని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే వర్మ అంటేనే ఓ సంచలనం. ఆ సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పార్వతీ పాత్రలో యజ్ఞా శెట్టి నటిస్తుంది. ఆమె లుక్‌ను వర్మ తాజాగా విడుదల చేశారు. ఆమె కన్నడ నటి. గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రంలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీగా ఈ యజ్ఞా శెట్టి ఒదిగిపోయి నటించన విషయం విధితమే.

అయితే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో వర్మ తన చిత్రాన్ని ప్రమోషన్ చేసుకునే కార్యక్రమాలను మొదటుపెట్టాడు. ఆ క్రమంలోనే లక్ష్మీ పార్వతీ లుక్‌ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రంలో చంద్రబాబుదీ కీలక పాత్ర. దాంతో చంద్రబాబు పాత్రకు తగ్గట్లు మరొ నటుడుని వర్మ ఎంపిక చేశాడనే టాక్ వైరల్ అవుతోంది.

చంద్రబాబు పాత్రలో నటిస్తున్న వ్యక్తి గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన వంగవీటి చిత్రంలో కీలక పాత్ర పోషించాడని.. అతడినే మళ్లీ చంద్రబాబు పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ జనవరి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.