ట్రైలర్‌లో కౌసల్య…

19 August, 2019 - 8:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, శివకార్తీకేయ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. ఆగస్ట్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదల చేశారు క్రియటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది. తన తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు కూతురు పడ్డ కష్టమే ఈ చిత్రం అని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

అలాగే నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు… నీన్ను, ఈ లోకం .. గెలుస్తానని చెబితే వినద.. గెలిచినవాడు చెబితే వింటుంది.. ఏం చెప్పినా గెలిచి చెప్పు .. ఈ తరహా సంభాషణలను మనస్సుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన కణా చిత్రాన్ని తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డి ఎన్ థామస్ సంగీతాన్ని అందించారు.