సాంగ్‌లో ‘మిస్ ఇండియా’

07 February, 2020 - 8:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మహానటి చిత్రం ద్వారా తన సత్తా ఎంటో నిరూపించుకున్న నటి కీర్తి సురేష్. మహానటిలో కీర్తి సురేష్ నటనకు జాతీయ పురస్కారమే ఆమె ఒడిలోకి వచ్చి వాలింది. కీర్తి సురేష్ తాజాగా నటిస్తున్న చిత్రం మిస్ ఇండియా.  ఈ చిత్రంలోకి కొత్తగా కొత్తగా.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌ను కీర్తి సురేష్ .. ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఎస్ ఎస్ తమన్ సంగీతంలో.. శ్రేయ ఘోషల్ గొంతు నుంచి జాలు వారిన ఈ పాట వీనుల విందుగా ఉంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ ఎస్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రోడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ మిస్ ఇండియా చిత్రం ఈ ఏడాది మార్చి 20 ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. వెండి తెరపై వెలిగిపోనుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, నదియా, నరేష్, రాజేంద్రప్రసాద్, కమల్ కామరాజు, భానుశ్రీ, నవీన్ చంద్ర, పూజిత తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.