బిగ్ బి కోడలుతో…

11 July, 2019 - 4:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వస్తున్న రెండో చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని.. నిర్మాణానంతర పనులు జరుపుకుంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ నటింపచేసేందుకు దర్శకుడు కోరటాల శివ .. తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాాచారం. ఈ అంశంపై ఇప్పటికే ఆ చిత్ర నిర్మాతగా వ్యవహరించనున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో కోరటాల శివ చర్చించారని తెలుస్తోంది. అందుకు రామ్ చరణ్‌ కూడా ఓకే చేశారట. ఈ చిత్రం సమాజానికి సందేశం ఇచ్చే విధంగా ఉంటుందని ఫిలింనగర్‌లో వైరల్ అవుతోంది.  కాగా ఈ చిత్రంలో ముందుగా అనుష్క, తమన్నా, నయనతారల పేర్లను దర్శకుడు కోరటాల శివ పరిశీలించారట. కానీ ఇప్పటికే సైరా నరసింహరెడ్డి చిత్రంలో నయనతార నటించడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారట. అదీకాక.. చిరు సరసన ఐశ్వర్యరాయ్ అయితే కరెక్ట్ అని దర్శకుడు కోరటాల శివ భావించినట్లు .. అందుకోసమే ఆమెను తన చిత్రంలో చిరంజీవి సరసన నటింప చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదీకాక ఐశ్వర్యరాయ్..  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. సైరా నరసింహరెడ్డి చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించారు. అందునా అమితాబ్‌కి చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ చాలా సన్నిహితులన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో కోరటాల శివ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ నటించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతోంది.