‘కథనం’ టీజర్ రిలీజ్

08 March, 2019 - 8:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : ప్రముఖ నటి అన‌సూయ భ‌ర‌ద్వాజ్  ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న సినిమా ‘కథనం.’ ఈ సినిమాకు  రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అవసరాల  శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు.

ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.  అనసూయ నటించిన క్షణం, రంగస్థలం సినిమాలు విజయవంతమైన విషయం తెలిసిందే. కథనం సినిమాతో అనసూయ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఈ వేసవిలో కథనం సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.