టీజర్‌లో ‘90 ఎంఎల్’

21 September, 2019 - 7:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించి తాజా చిత్రం 90 ఎంఎల్. సెప్టెంబర్ 21 హీరో కార్తికేయ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కార్తీకేయ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, అలీ, అజేయ్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సర్వాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వం వహిస్తుంటే.. అజేయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం పూర్తిగా ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ కార్తికేయ నటించి తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రంలో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయి నటించారు. దీంతో ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పట్ల విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రం కూడా మంచి హిట్ టాక్‌ను అందుకుంది.