ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి

09 May, 2019 - 8:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఈ చిత్రం ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నానీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ‘పార్ధా.. కర్మలను ఆచరించుటయెందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణం కారాదు.

అలాగని కర్మలు చేయుట మానరాదు’ అనే డైలాగ్‌తో ఈ చిత్ర ట్రైలర్‌ మొదలైంది. అనంతరం ఏం సెప్తిరి ఏం సెప్తిరి. ఎప్పుడు ఇలాగే సెప్తారా అంటూ రాజశేఖర్ వాయిస్ వినిపిస్తోంది. ఈ చిత్రం శివాని శివాత్మిక మూవీస్ బ్యానర్‌పై సి. కళ్యాణ్, హీరో రాజశేఖర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ చిత్రం త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాజశేఖర్ జోడిగా ఆదా శర్మ, నందిత శ్వేతలు నటిస్తున్నారు.