కళాతపస్వికి సొంతూరిలో కళా నీరాజనం

13 September, 2017 - 3:11 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

విజయవాడ: సినిమా రంగంలో తెలుగుదనం ఉట్టిపడేలా, సంస్కృతీ సంప్రదాయాలు వ్యాప్తి చెందేలా సినిమా, ప్రపంచంలో ప్రత్యేక స్దానాన్ని సంపాదించిన కళా తపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌కు సొంత ఊరిలో అరుదైన గౌరవం లభించింది. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో కళాతపస్వి కె విశ్వనాథ్‌కి నృత్య నీరాజనం కనుల విందుగా సాగింది.సినీ దర్శకుడిగా, నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన కె. విశ్వనాథ్‌కు 1200 మంది విద్యార్థులతో నృత్యనీరాజన కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత విశ్వనాథ్‌కు వంతెన సెంటర్‌లో గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరరం గాంధీ క్షేత్రంలో 12 స్కూళ్ళు, కళాశాలలకు చెందిన 1200 మంది విద్యార్తులతో విశ్వనాథ్ చిత్రాల్లోని 15 పాటలకు నృత్య ప్రదర్శన చేశారు. ఒక్కో పాటకు 100 మంది విద్యార్థులతో ఇచ్చిన ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందుతుంది.